బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కే కేశవరావు పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కలిశారు. కేకే పార్టీ మారుతారని కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కేసీఆర్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేకే వెంట ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. తనకు బీఆర్ఎస్‌లో ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంతో కేసీఆర్‌ను కలిసి పార్టీ మార్పు అంశంపై చెప్పేందుకు వెళ్లినట్లుగా ప్రచారం సాగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లినప్పుడు ఆయన చేతిలో కొన్ని పేపర్లు ఉన్నాయి. దీంతో ఆయన రాజీనామా సమర్పించేం దుకు వెళ్లి ఉంటారనే చర్చ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కేకే తన రాజకీయ భవిష్యత్తుపై నిన్న తన ఫ్యామిలీతో చర్చించిన ట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తనకు చాలా చేసిందని, రిటైర్మెంట్ వయస్సులో తన సొంత పార్టీ వైపు చూస్తే తప్పేమి టని కేకే అన్నట్లు తెలుస్తోంది. కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితోనూ పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మేయర్ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళతారనే ప్రచారం సాగుతోంది.
ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేశవరావుతో కేసీఆర్ మంతనాలు
0
281
Previous article
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


