స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే మధ్యాహ్నాం ఒంటి గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. కస్టడీ పిటిషన్ తర్వాతనే మిగిలిన పిటిషన్లపై విచారణ చేపడతామని వెల్లడించారు. స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడును మరింత విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ పిటిషన్‌లో తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ఐదు రోజులు కస్టీడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మరికాసేపట్లో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వండి… ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం
0
381
Latest Articles
అక్కినేని ఫ్యామిలీ హీరోకి.. ఈసారైనా కలిసొస్తుందా..?
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్.. టాలెంటెడ్ యాక్టర్. ఆయన సినిమాలు ప్లాప్ అయ్యాయి కానీ.. యాక్టర్ గా సుమంత్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. భారీ అభిమాన గణం ఉంది.. టాలెంట్ ఉంది.. అయినా...
- Advertisement -
- Advertisement -


