25.7 C
Hyderabad
Tuesday, November 12, 2024
spot_img

చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వండి… ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే మధ్యాహ్నాం ఒంటి గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. కస్టడీ పిటిషన్ తర్వాతనే మిగిలిన పిటిషన్లపై విచారణ చేపడతామని వెల్లడించారు. స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడును మరింత విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ పిటిషన్‌లో తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ఐదు రోజులు కస్టీడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మరికాసేపట్లో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

Latest Articles

‘మట్కా’ 20 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకునేలా ఉంటుంది: కరుణ కుమార్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్