నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాల్సిందే.. మద్దతుకై నేడు ఈటల రాక

స్వతంత్ర వెబ్ డెస్క్: మాస్టర్ ప్లాన్(Master Plan) తో నిర్మల్(Nirmal) పట్టణ ప్రజలను నిండా ముంచుతున్నారని, బీఆర్ఎస్(BRS) నేతలు తమ ఆస్తుల విలువ పెంచుకుంటున్నారని బీజేపీ(BJP ) సహా కాంగ్రెస్(Congress) నేతలు విమర్శిస్తున్నారు. గ్రీన్ జోన్(Green Zone) లో ఉన్న పంట పొలాలను ఇండస్ట్రియల్ జోన్(Industrial Zone) లోకి మార్చి రైతులను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Aleti Maheshwar Reddy) ఆరోపించారు. నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా బిజెపి ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే బిజెపి నాయకులు జాతీయ రహదారి దిగ్భందనానికి పిలుపునిచ్చారు.

శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు వెళుతున్న మహేశ్వర్ రెడ్డిని పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉండడంతో ఎలాంటి నిరసన ప్రదర్శనలకు, ఆందోళనలకు అనుమతి లేదని ఇంటి వద్దే అడ్డుకున్నారు. దీంతో బిజెపి నాయకులకు, పోలీసులకు కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీసుల అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు బైఠాయించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతు తెలిపెందుకు గురువారం హుజూరాబాద్(Huzurabad) ఎమ్మెల్యే బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్(Etala Rajender) రానున్నారు.

Latest Articles

మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్‌ స్పీకర్‌ రథీంద్ర బోస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్