Minister Amarnath: చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవకుండా.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం పవన్‌ కల్యాణ్‌కు(Pawan Kalyan) ఏమాత్రం ఇష్టంలేదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌(Gudivada Amarnath,) ధ్వజమెత్తారు. ఎర్రమట్టి దిబ్బలు ఆక్రమిస్తున్నారంటూ పవన్‌ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కొత్తవలసలో వీఎంఆర్‌డీఏ(VMRDA) అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రలో భూ కుంభకోణాలు బయట పెడతానంటూ నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్‌ వాటిని నిరూపించలేక బొక్క బోర్లా పడ్డారని వ్యాఖ్యానించారు. “మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవకుండా, వాస్తవాలు తెలుసుకొని, అవగాహన పెంచుకుని ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది” అని హితవు పలికారు.

చంద్రబాబు హయాంలో ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలు కబ్జాకు గురైతే పెదవి విప్పని పవన్‌ ఇప్పుడు ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆయన పర్యటించిన ప్రాంతంలో ఎక్కడా లోపాలు దొరక్కపోవడంతో నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌కీ(National Green Tribunal), మోదీకి చెప్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్‌ ఇక్కడ ఉండే ఒకట్రెండు రోజుల్లోనైనా ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోవాలని,  అవాస్తవాలను మాత్రం మాట్లాడొద్దని సూచించారు.

Latest Articles

మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్‌ స్పీకర్‌ రథీంద్ర బోస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్