టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. గ్రూప్-2 పరీక్ష వాయిదాకు అభ్యర్థుల ధర్నా

స్వతంత్ర వెబ్ డెస్క్: టీఎస్‌పీఎస్సీ (Tspsc) కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రికత్త చోటచేసుకుంది గ్రూప్-2 (Group -2) వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్‌ టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీస్‌ ముందు వేలాది మంది అభ్యర్థులు బైఠాయించారు. వరుస పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్‌కు తమకు సమయం లేదని చెబుతూ గ్రూప్‌-2 వాయిదా వేయాలని కోరారు.  టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్‌​ (Congress), టీజేఎస్‌(TJS) మద్దతు తెలిపింది. కోదండరాం, దయాకర్‌, కాంగ్రెస్‌ నేతలు నిరనసలో పాల్గొన్నారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటంతో అభ్యర్థులను పక్కకి పంపించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్నారు పోలీసులు.

ఇప్పటికే ఈ నెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో టెట్ పరీక్ష ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూప్స్‌కు చదివేందుకు సమయం లేదని వాపోయారు. అంతేగాక ఇప్పటికే పలు పేపర్ లీకేజీ జరిగిన అదే బోర్డుతో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష జరగాల్సి ఉంది. మొత్తం 5,51,943 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

Latest Articles

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్