స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లో భారత వాయుసేన(IAF)కు చెందిన మిగ్ ఫైటర్ జెట్ విమానం కూలింది. హనుమాన్‌గఢ్ జిల్లాలో ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సూరత్‌గఢ్ నుంచి టేకాఫ్ అయిన మిగ్ 21 ఫైటర్‌జెట్ డబ్లీ ప్రాంతంలోని ఓ ఇంటిపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడగా.. శిథిలాల కింద పడి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది జనవరిలో రెండు వేర్వేరు ఘటనలలో సుఖోయ్ సు-30, మిరాజ్-2000 యుద్ధవిమానాలు అకస్మాత్తుగా కూలిపోయిన సంగతి తెలిసిందే.
మిగ్ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో ఇద్దరు మృతి
0
291
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


