స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీ కాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్న తలైవా తదుపరి ప్రాజెక్టుగా లాల్ సలామ్ చేస్తున్నాడు. రజనీ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం నుంచి రజనీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ మూవీలో మొయిద్దీన్ భాయ్ పాత్రలో ఆయన నటిస్తున్నట్లు తెలిపింది. ఇందులో యంగ్ హీరో విష్ణు విశాల్, సీనియర్ నటి జీవితా రాజశేఖర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా ద్వారా జీవిత రీ ఎంట్రీ ఇస్తోంది. మూవీలో రజినీ కాంత్ సోదరిగా ఆమె నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
Everyone’s favourite BHAI is back in Mumbai 📍 Make way for #Thalaivar 😎 SuperStar 🌟 #Rajinikanth as #MoideenBhai in #LalSalaam 🫡
இன்று முதல் #மொய்தீன்பாய் ஆட்டம் ஆரம்பம்…! 💥
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl
🎥… pic.twitter.com/OE3iP4rezK— Lyca Productions (@LycaProductions) May 7, 2023