మిగ్ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో ఇద్దరు మృతి

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లో భారత వాయుసేన(IAF)కు చెందిన మిగ్ ఫైటర్ జెట్ విమానం కూలింది. హనుమాన్‌గఢ్‌ జిల్లాలో ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సూరత్‌గఢ్‌ నుంచి టేకాఫ్‌ అయిన మిగ్‌ 21 ఫైటర్‌జెట్‌ డబ్లీ ప్రాంతంలోని ఓ ఇంటిపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌ పారాచూట్‌ సాయంతో సురక్షితంగా బయటపడగా.. శిథిలాల కింద పడి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది జనవరిలో రెండు వేర్వేరు ఘటనలలో సుఖోయ్ సు-30, మిరాజ్-2000 యుద్ధవిమానాలు అకస్మాత్తుగా కూలిపోయిన సంగతి తెలిసిందే.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్