Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

పీఎస్‌ఎల్‌వీ -సీ58 ప్రయోగం హిట్‌

కొత్త సంవత్సరానికి అనూహ్య విజయంతో స్వాగతం పలికింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించిన ఎక్స్‌పోశాట్ ప్రయోగం సూపర్‌ డూపర్‌గా హిట్‌ అయింది. కృష్ణ బిలాలకు సంబంధించి విస్తృత అధ్యయనం చేయడమే ఎక్స్‌పోశాట్ మిషన్ ప్రధాన ఉద్దేశమన్నారు ఇస్రో సైంటిస్టులు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే…వావ్ …అనిపించే ఈ అద్భుత విజయాన్ని ఇస్రో సాధించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కిందటేడాది అనేక అనేక సక్సెస్‌లు తన ఖాతాలో స్వంతం చేసుకుంది. వీటిలో చంద్రయాన్ – త్రీ ప్రముఖమైనది. చంద్రయాన్ – త్రీ ప్రయోగంతో అంతర్జాతీయంగా ఇస్రో తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో మొట్టమొదటి శాటిలైట్ పీఎస్‌ఎల్‌వీ -58 విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది. 480 కిలోల శాటిలైట్‌ను నింగిలోకి తీసుకెళ్లింది. కాగా ఎక్స్ రే మూలాలను అన్వేషించడానికి ఎక్స్‌పో శాట్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టారు. నిర్ణీత సమయానికి టేకాఫ్ అయిన పీఎస్‌ఎల్‌వీ -58 ఉపగ్రహం, మొదటి అలాగే రెండవ దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు విజయాలు కొత్తకావు. ఇటీవలి కాలంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ వరుస ప్రయోగాలు చేస్తోంది ఇస్రో. చంద్రయాన్ – త్రీ ప్రయోగం విజయం సాధించిన నేపథ్యంలో ఆదిత్య ఎల్‌ -ఒన్ ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. సూర్యుడి గుట్టు విప్పడమే ఆదిత్య ఎల్‌ -ఒన్ ప్రయోగం అసలు లక్ష్యం. కిందటేడాది సెప్టెంబర్ రెండో తేదీన ఆదిత్య ఎల్ ఒన్ మిషన్‌ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపించింది.

ఇక పీఎస్‌ఎల్‌వీ సీ-58 విషయానికొస్తే, ఈ ప్రయోగం కూడా విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్‌ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-58 నింగిలోకి దూసుకెళ్లింది . ఎక్స్-రే పొలారిమీటర్‌ ఉపగ్రహంతో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం మొదలైన 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. ఇందులో తిరువనంతపురం ఎల్‌బీఎస్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారు చేసిన ఉమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు ఉన్నాయి. అంతరిక్షంలో ఎక్స్‌పోశాట్ ప్రయోగం ఐదేళ్ల పాటు మనుగడలో ఉంటుంది.

ఎక్స్‌పోశాట్ ప్రయోగం భారతదేశ అంతరిక్ష పరిశోధనల్లో ఒక మైలురాయి అన్నారు ఇస్రో సైంటిస్టులు. గతంలో ఇస్రో చేపట్టిన మిషన్లు…ప్రధానంగా స్పెక్ట్రోస్కోపీపై దృష్టి పెట్టాయి. అయితే ఇస్రో తాజాగా చేపట్టిన ఎక్స్‌పోశాట్ ప్రయోగం పూర్తిగా భిన్నమైనది. ఎక్స్‌పోశాట్ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష పరిశోధనలు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఒక సరికొత్త కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందన్న ఆశాభావాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు వ్యక్తం చేశారు. ఎక్స్‌పోశాట్ తరహా ప్రయోగాలు గతంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ …నాసా మాత్రమే చేసేదన్నారు సైంటిస్టులు. ప్రపంచంలో మరే ఇతర దేశం ఇలాంటి ప్రయోగాలు చేయలేదని స్పష్టం చేశారు. నాసా తరువాత…. ఎక్స్‌పోశాట్ ప్రయోగాలకు నాంది పలికింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థేనని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టారు.

కృష్ణ బిలాలు …ఇప్పటికీ ఇదొక మిస్టరీ. అసలు కృష్ణ బిలాలు ఏమిటి ? అందులో ఏముంటాయి ? అంతరిక్షంలో కృష్ణ బిలాల ప్రాధాన్యం ఏమిటి…ఈ విషయాలు ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియవు. ఇలాంటి కీలకమైన కృష్ణ బిలాలను అధ్యయనం చేయడానికి తాజాగా చేపట్టిన ఎక్స్‌పో శాట్ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఇస్రో సైంటిస్టులు. పీఎస్‌ఎల్‌వీ చివరి దశలో మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనికే పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ అని పేరు పెట్టారు. టోటల్‌గా నూతన సంవత్సరం ప్రారంభమైన తొలి రోజే అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి మరో ఘనతను ఇస్రో సాధించింది. ఈ అద్భుత విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు.

అంతరిక్ష పర్యాటకం… కొన్నేళ్ల కిందటివరకు ఈ మాట ఎక్కడా వినపడేది కాదు. మహా అయితే వ్యోమగాములు, అంతరిక్ష శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ పదం పరిమితం. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చంగా పరిశోధకులకు మాత్రమే అంతరిక్ష పర్యాటకం పరిమితమైంది. అయితే ఇటీవలికాలంలో అంతరిక్ష పర్యాటకం అనే అంశం ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పుడు ప్రపంచమంతా అంతరిక్ష పర్యాటకం జపం చేస్తోంది. అంతరిక్ష పర్యాటకం అనేది చాలాకాలం పాటు ఒక కలలాంటిదే. అయితే అసలు ఈ కల సాకారమవుతుందా ? లేదా ? అనే ప్రశ్న కూడా తెరమీదకు వచ్చింది.అయితే కాలక్రమంలో ఈ కలను సాకారం చేశాయి అంతరిక్షంతో ముడిపడ్డ అనేక కంపెనీలు. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనుక ఆయా సంస్థల రాత్రింబవళ్ల కష్టం ఉంది. అంతరిక్ష పరిశోధకుల స్వేదం ఉంది.

‘వర్జిన్‌ గెలాక్టిక్‌ ’అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ. వర్జిన్ గెలాక్టిక్ అంటే సాదాసీదా కంపెనీ కాదు. రోదసీయాత్రలు చేపట్టే ఓ బడా కంపెనీ. 2004లో రిచర్డ్ బ్రాన్సన్ అనే సంపన్నుడు ‘వర్జిన్‌ గెలాక్టిక్‌ ’ పేరుతో ఒక స్పేస్ టూరిజం కంపెనీని స్థాపించాడు. 2021 జులై నెలలో ఓ రోదసీయాత్ర నిర్వహించింది ‘వర్జిన్‌ గెలాక్టిక్‌ . సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో ఆరుగురు ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ-22’ అనే వ్యోమనౌక ద్వారా వినువీధుల్లో విహరించారు. వినువీధుల్లో విహారం తరువాత సురక్షితంగా భూమి మీదకు తిరిగివచ్చారు. ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’వ్యోమనౌక చేపట్టిన రోదసీయాత్ర మొత్తం 65 నిమిషాలపాటు సాగింది. ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’రోదసీ యాత్ర, అంతరిక్ష పర్యాటకానికి ద్వారాలు తెరచిందంటారు నిపుణులు.

ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు కూడా అంతరిక్ష పర్యాటకంతో సంబంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సైతం 2021లో తన స్వంత వ్యోమనౌకలో రోదసీ యాత్ర చేశారు.జెఫ్‌ బెజోస్‌ నెలకొల్పిన కంపెనీ ‘బ్లూ ఆరిజిన్‌’ ఈ రోదసీ యాత్ర నిర్వహించింది.

స్పేస్‌ఎక్స్‌…అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన మరో సంస్థ ఇది. వివాదాస్పద కార్పొరేట్ దిగ్గజం ఎలన్ మస్క్‌ స్వంత సంస్థ ఇది. అంతరిక్షంపై తన ఆలోచనలకు అనుగుణంగా ఎలన్ మస్క్‌, స్పేస్‌ ఎక్స్‌ అనే సంస్థను ప్రారంభించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎలన్ మస్క్ పేరు మార్మోగింది. అంతరిక్ష పర్యాటకరంగంలో స్పేస్‌ఎక్స్‌…ఒక వినూత్న ప్రాజెక్ట్‌ అంటారు నిపుణులు. టెస్లా కారు విజయం తరువాత, అంతరిక్షం వైపు ద్రుష్టి పెట్టాడు ఎలన్ మస్క్. అంగారకుడిపై మీద మొక్కలు పెంచే ‘మార్స్‌ ఒయాసిస్‌’ అనే ప్రాజెక్టు గురించి ప్రచారం చేశాడు. భవిష్యత్తులో ఎప్పటికైనా మనిషి అక్కడికి వలస వెళ్లే అవకాశం ఉందని బలంగా నమ్మాడు. ఈ నేపథ్యంలో స్పేస్‌ ఎక్స్‌ అనే సంస్థను స్థాపించాడు. స్పేస్‌ ఎక్స్‌తో అంతరిక్షంలోకి ఎలన్ మస్క్‌ అడుగుపెట్టాడు. అయితే తొలిరోజుల్లో స్పేస్ ఎక్స్‌ సంస్థ భవిష్యత్తుపై అనేక అనుమానాలు తలెత్తాయి. కానీ ఈ అనుమానాలను పట్టించుకోకుండా స్పేస్‌ఎక్స్‌ సంస్థపై దృష్టి కేంద్రీకరించాడు ఎలన్‌ మస్క్‌.

అంగారకుడిపైకి వెళ్లాలంటే రాకెట్లు అవసరం. దీంతో రష్యాలో ఖండాంతర క్షిపణులను కొనుగోలు చేయాలని భావించాడు.అయితే, ఒక్క రాకెట్‌ను ఎనిమిది మిలియన్‌ డాలర్లకు విక్రయిస్తామని రష్యా ఆయుధ వ్యాపారులు తెలిపారు. అది ఎక్కువ మొత్తం అని మస్క్‌ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్‌ నేరుగా అమెరికా విమానం ఎక్కేశాడు. అయితే ఆయన మనస్సులో ఒకే ఆలోచన.. ఎలాగైనా అంగారకుడిని చేరుకోవాలి.. రాకెట్లను అత్యంత చౌకగా తయారు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చాడు.

మార్కెట్‌ ధరలో మూడు శాతం ధరకే రాకెట్‌ను తయారు చేయవచ్చని ఎలన్‌ మస్క్‌ భావించాడు. దీంతో తన సొంత డబ్బు 100 మిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టి 2002 మే నెలలో ‘స్పేస్‌ఎక్స్‌’సంస్థను ప్రారంభించాడు. స్పేస్‌ఎక్స్‌ సంస్థకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ…. నాసా ఆర్థిక సాయం అందజేసింది. 2006లో స్పేస్‌ఎక్స్‌ తొలిరాకెట్‌ను ప్రయోగించింది. అయితే తొలి ప్రయోగం తుస్సుమంది. కేవలం 33 సెకన్లలోనే అది పేలిపోయింది. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా ఎలన్ మస్క్‌ ప్రయోగాలు చేయడం మానలేదు. 2007,2008 సంవత్సరాల్లో చేసిన ప్రయోగాలు కూడా విఫలమయ్యాయి.దీంతో ఎలన్‌ మస్క్‌ తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. స్పేస్‌ఎక్స్‌ దివాళా తీయడం ఖాయమని పెట్టుబడిదారులు భావించారు. మస్క్‌ దగ్గర కేవలం మరొక ప్రయోగానికే మాత్రమే డబ్బు ఉంది. అయితే మస్క్ చివరి ప్రయోగం విజయవంతమైంది. 2008 సెప్టెంబర్‌లోని చివరి ప్రయోగమే ఎలన్ మస్క్‌ జీవితాన్ని మార్చేసింది. 2008 సెప్టెంబర్‌లో ప్రయోగించిన ఫాల్కన్‌-ఒన్ రాకెట్‌ విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. స్పేస్‌ఎక్స్‌ సంస్థ ఖాతాలో విజయం నమోదైంది. దీంతో అదే ఏడాది నాసా 1.6 బిలియన్‌ డాలర్ల భారీ కాంట్రాక్టు… స్పేస్‌ఎక్స్‌కు లభించింది. ఏమైనా ప్రైవేటు రంగంలో అతిపెద్ద రాకెట్‌ ఇంజిన్ల తయారీ సంస్థగా స్పేస్‌ఎక్స్‌ అవతరించింది.

ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పర్యాటకంపై అన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. సహజంగా టూరిజం అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే అంతరిక్ష పర్యాటకం అంటే మరింత ఆసక్తి ఉంటుంది. స్పేస్ టూరిజం అంటే…ఏకంగా ఆకాశ మార్గాన పయనించడమే. రోదసీలో చక్కర్లు కొట్టడమే. అయితే అంతరిక్ష పర్యాటకం అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కోటీశ్వరులకు మాత్రమే ఉంటుంది. అంతరిక్ష పర్యాటకానికి సంబంధించిన ధరలను సామాన్యులు ఏమాత్రం భరించలేరు. సహజంగా అంతరిక్షంలోకి రానూపోనూ ఒక్కో టికెట్ ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ కంపెనీ అమ్మిన అంతరిక్ష టికెట్‌ ఒక్కోటి భారతీయ కరెన్సీలో దాదాపు రూ.1.86 కోట్లతో సమానం. ముందుగా రోదసీ యాత్ర అంటే ఏమిటో తెలుసుకోవాలి. భూమి పైనుంచి దాదాపు తొంభై కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లి తిరిగి రావటాన్ని రోదసీలోకి వెళ్లిరావటంగా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోదసిలో ప్రయోగాలకు వేదికగా ఉన్న ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం’ 409 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ లెక్కన 90 కిలోమీటర్ల ఎత్తు అనేది రోదసి ముఖద్వారం వంటిది అనుకోవాలి. అయినప్పటికీ, అక్కడికి వెళ్లి రావటం, అంతరిక్ష అందాలను చూడటం ఓ గొప్ప అనుభవం అంటారు అంతరిక్షరంగ నిపుణులు.

అంతరిక్ష పర్యటకం అనేది అంతరిక్ష చట్టానికి లోబడి ఉంటుంది. రోదసీయాత్ర చేసే వ్యోమనౌక, భూ ఉపరితలం నుంచి ఆకాశంలోకి బయల్దేరుతుంది. ఆ తరువాత అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది. అంతరిక్ష పర్యాటకం అనేది ప్రాథమికంగా సదరు దేశాల భూభాగం అలాగే ఆయా దేశాల సార్వభౌమాధికారానికి లోబడి ఉంటుంది. రోదసీయాత్రలను అంతరిక్ష చట్టం నియంత్రిస్తుంది. అంతరిక్ష చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా రోదసీ యాత్రలకు అధికారులు అనుమతి ఇస్తుంటారు. భారత్‌ కూడా ఇటీవలికాలంలో అంతరిక్ష పర్యాటకంపై దృష్టి పెట్టింది. భారతదేశంలో చాలామంది రోదసీ యాత్రలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతదేశంలో తొలిసారి స్పేస్ టూరిజం ప్రారంభించాలని ఇస్రో యోచిస్తోంది. ఈ రోదసీ యాత్రలో ఒక్కో టికెట్ ధర దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఉండే అవకాశముంది అంటున్నారు అంతరిక్ష నిపుణులు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి.

భారతదేశంలో రోదసీ యాత్రలకు మంచి భవిష్యత్ ఉందంటున్నారు అంతరిక్షరంగ నిపుణులు. అంతరిక్ష యాత్ర…నిస్సందేహంగా లాభదాయకమే అంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న రోజుల్లో అంతరిక్ష యానం అనేది ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందని జోస్యం చెప్పారు నిపుణులు. అంతరిక్ష పర్యాటకానికి వివిధ భారతీయ మంత్రిత్వ శాఖలు కొత్త పథకాలతో ముందుకు వస్తున్నాయి. అంతరిక్ష పర్యాటకానికి మద్దతు ఇవ్వడానికి అనేక వనరులు కూడా ఏర్పాటయ్యాయి. మౌలికంగా స్పేస్ టూరిజం ఇండస్ట్రీకి హై-ఫై టెక్నాలజీ మెషినరీలు చాలా అవసరం అంటున్నారు అంతరిక్షరంగ నిపుణులు.

కస్టమర్లకు అంతరిక్ష ప్రయాణంలో ప్రత్యక్ష లేదా పరోక్ష అనుభవాన్ని అందించే వాణిజ్య కార్యకలాపాలనే రోదసీ యాత్ర అంటున్నాం. కొన్నేళ్ల కిందట వరల్ట్ టూరిస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ టూరిజం సంస్థ కూడా ఇదే నిర్వచనం ఇచ్చింది. కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పర్యాటకం ప్రధాన వనరుగా ఉంది. పర్యాటకం ద్వారా అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్న భారతదేశం తాజాగా అంతరిక్ష పర్యాటకంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం భారతదేశం ఎదురు చూస్తున్న అత్యంత ఉత్తేజకరమైన పర్యాటక రూపాలలో ఒకటి అంతరిక్ష పర్యాటకం. ఇప్పుడు, అంతరిక్షం అందరికీ చివరి సరిహద్దుగా మారింది.

మనదేశ ఆర్థిక వ్యవస్థకు అంతరిక్ష టూరిజం ఊతం ఇస్తుందంటున్నారు నిపుణులు. అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం ముందుగా స్పష్టమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. జాతీయత, వ్యోమనౌక ఫిట్‌నెస్‌ను గుర్తించడం, వైద్య ప్రమాణాలు, అంతరిక్ష సిబ్బందికి లైసెన్సింగ్, భద్రతా జాగ్రత్తలు ..ఇవన్నీ ఇందులో ముఖ్యమైనవి. రోదసీ యాత్రలను విజయవంతం చేయడానికి భారతదేశం ముందుగా వీటిపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. కాగా స్పేస్ టూరిజం భూభాగంలోకి భారతదేశం ప్రవేశించడానికి అంతరిక్ష చట్టాలు ఏమేరకు అనుతిస్తాయన్న ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. వీటి సంగతి ఎలా ఉన్నా, అంతరిక్ష పర్యాటకం అనేది చిన్న విషయం కాదు. కోట్లాది రూపాయల మేర పెట్టుబడులు అవసరం. ఈ భారీ పెట్టుబడులను కేవలం ప్రభుత్వ సంస్థలే పెట్టాలనుకోవడం అత్యాశే అవుతుంది. అంతరిక్ష పర్యాటకంలో ప్రైవేటుసంస్థల పెట్టుబడులు కూడా అవసరమవుతాయి. అయితే అంతరిక్ష పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ని ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తాయనేదే ప్రశ్న. ఈ విషయంలో ప్రైవేటు సంస్థలను అంతరిక్ష పరిశోధకులు ఒప్పించగలగాలి. ప్రైవేటు సంస్థల ఇన్‌వాల్వ్‌మెంట్‌తో స్పేస్ టూరిజాన్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్లాలని భావిస్తున్నారు నిపుణులు. ఏమైనా, సమర్థవంతంగా నిర్వహిస్తే అంతరిక్ష పర్యాటకం ఒక లాభదాయక పరిశ్రమ అవుతుందంటున్నారు నిపుణులు.

ప్రపంచంలో సామాజిక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవలికాలంలో పర్యాటకరంగం అభివృద్ధి చెందింది. ప్రజల్లో కొత్త ప్రదేశాలు చూడాలన్న ఆసక్తే తొలిరోజుల్లో పర్యాటకరంగానికి పునాదిగా ఉండేది. అయితే రానురాను దేశ కాలమాన పరిస్థితులు మారిపోయాయి.రకరకాల కారణాలతో ప్రజలు వేర్వేరు కొత్త ప్రదేశాలకు వెళ్లడం మొదలైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకరంగం పెరిగింది. అయితే ఇప్పుడు ప్రజల ఆలోచనాధోరణి మారింది. ఏకంగా అంతరిక్షంలోకి ఓ ట్రిప్ వేయాలన్న కుతూహలం ప్రజల్లో పెరిగింది. రానున్న రోజుల్లో ఈ కుతూహలం మరింతగా బలపడుతుందని అంతరిక్షరంగ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు ఉత్తర దేశయాత్ర లాగా భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సర్వసాధారణం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్