28.2 C
Hyderabad
Sunday, December 3, 2023
spot_img

కాంగ్రెస్​లో చేరిక గురించి నా సోదరుడు నాతో మాట్లాడలేదు- కోమటిరెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన త్వరలోనే తిరిగి తన సొంత గూడైన కాంగ్రెస్​లోకి చేరనున్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించే సత్తా ప్రస్తుతం బీజేపీ కంటే కాంగ్రెస్​కే ఎక్కువగా ఉన్నందున ఆయన తిరిగి కాంగ్రెస్​లో చేరుతున్నట్లు తాను విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్​లో చేరడంపై ఆయన సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకే కాంగ్రెస్​లో చాలా మంది నేతలు చేరుతున్నారని అన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరడం గురించి తనతో మాట్లాడలేదని చెప్పారు. డైరెక్టుగా ఆ విషయం అధిష్ఠానంతో మాట్లాడాడని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాకుండా చాలా మంది కీలక నేతలు హస్తం గూటికి వస్తున్నారని వెంకట్​ రెడ్డి పేర్కొన్నారు.

Latest Articles

రంగంలోకి డీకే.. అసలేం జరగబోతోంది?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనుండడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని అంచనాలు రావడం, అలాగే హంగ్ ఏర్పడే అవకాశం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్