ఎన్నికల సమర శంఖం పూరించనున్న తెలంగాణ బీజేపీ

      పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. రేపటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించ బోతుంది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అనంతరం ప్రచార రథాలను ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 లోక్‌సభ స్థానాలు, 35 శాతం ఓటు బ్యాంకు సాధించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

         బీజేపీ మూడోసారి ఎందుకు అధికారంలోకి రావాలో వివరిస్తూ.. రాష్ట్రానికి సంబంధించి పదేళ్లలో కేంద్రం చేసిన సహకా రాన్ని ప్రజలకు తెలియజేస్తామంటున్నారు బీజేపీ నేతలు. లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు 17 పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించారు. ఆ 5 క్లస్టర్లలో మొత్తం 4 వేల 238 కిలోమీటర్ల మేర రథయాత్రలు నిర్వహించనున్నారు. యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నట్టు పార్టీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. విజయ సంకల్ప యాత్రకు రాష్ట్ర ప్రముఖులు నాయకత్వం వహిస్తారు.ఆయా క్లస్టర్ల పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌ తదితర పార్టీల సీనియర్‌ నేతలు పాల్గొంటారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పదేళ్లలో సాధించిన విజయాలు, విపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్ర ల ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. బస్సుయాత్రల్లో భాగంగా నిర్వహించే కార్నర్ మీటింగ్ లకు బీజేపీ పాలిత రాష్ట్రా ల సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయ పార్టీల నేతలు హాజర వుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ వద్ద కుమురం భీమ్ క్లస్టర్ యాత్రను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 21 అసెంబ్లీ నియోజకవ ర్గాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గా ల మీదుగా సాగి నిజామాబాద్ జిల్లా బోదన్‌లో ముగుస్తుంది.

      వికారాబాద్‌ జిల్లా తాండూరులో రాజేశ్వరి క్లస్టర్‌ను గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రారంభించనున్నారు. 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర సాగి కరీంనగర్‌లో ముగుస్తుంది. భాగ్యలక్ష్మి క్లస్టర్ యాత్ర భువనగిరి నుంచి ప్రారంభమై మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసి హైదరాబాద్‌లో ముగుస్తుంది. భద్రాచలం నుంచి ప్రారంభమయ్యే కాకతీయ-భద్రకాళి క్లస్టర్ బస్సు యాత్ర మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, 21అసెంబ్లీ స్థానాలను కవర్ చేసి ములుగు జిల్లాలో ముగుస్తుంది. కృష్ణా నది మఖ్తల్ వద్ద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కృష్ణమ్మ క్లస్టర్ యాత్రను ప్రారంభించనున్నారు. బస్సు యాత్ర మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు, 21అసెంబ్లీ స్థానాల్లో సాగి నల్గొండలో ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్