బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఈ కార్య క్రమంలో పాల్గొన్న ఏకైక భారతీయ నటి ఈమే కావడం విశేషం. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో దీపిక భారతీయత ఉట్టిపడేలా సబ్యసాచి చీరలో వేదికపై మెరిసిపోయారు. ‘బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్’ కేటగిరీలో ఆమె అవార్డును ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన పొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ఇండియన్ క్వీన్’అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతర్జాతీయ సినీ వేడుకల్లో దీపిక పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది ‘నాటు నాటు’ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అందు కుంది. ఆ అవార్డుల కార్యక్రమంలో దీపిక ప్రజెంటర్‌గా వ్యవహరించారు. అవార్డు ప్రకటనకు ముందు ఈ పాటను ఆమె పరిచయం చేశారు.
బ్రిటీష్ అవార్డుల వేడుకలో మెరిసిన దీపికా పదుకొనె
0
401
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


