ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. మనీ లాండరింగ్ ఆరోపణల దర్యాప్తులో భాగంగా ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగఢ్ లోని ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రావత్, ఆయన శాఖాధికారులు టైగర్ సఫారీ ప్రాజెక్టు కింద కార్బెట్ పార్క్ లోని పఖ్రూ టైగర్ సఫారీలో చెట్ల నరికివేత, అక్రమంగా నిర్మాణాలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. సఫారీలో 163 చెట్లు కొట్టేందుకు అటవీశాఖ అనుమతి ఇస్తే.. ఏకంగా ఆరు వేల చెట్లను నరికించేశారు.


