టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. మురళీమోహన్ 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఎక్స లెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదిత రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ దండతో మురళీమోహన్‌ను సత్కరించారు. క్రమశిక్షణ, నిజాయితీతో ఉన్న త శిఖిరాలను అధిరోహించడమే కాకుండా జయాపజయాలను ఒక్కటిగా తీసుకోవడం మురళీమోహన్‌కు గొప్ప వరంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మురళీ మోహన్ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం ఒక రికార్డు అని, అది కొందరికే సాధ్యమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 1100 మందిని డాక్టర్, ఇంజనీర్లుగా తన స్వంత ఖర్చులతో చదివించిన విద్యాదాత అంటూ ప్రశంసించారు చంద్రబాబు.
యాభై వసంతాల సినీ ప్రస్థానం …. నటుడు, నిర్మాత మురళీమోహన్‌కు ఘన సత్కారం
0
390
Previous article
Latest Articles
సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


