వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. సచివాలయంలో వేములవాడ దేవాలయం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి కార్యకలాపాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ల సమీక్షా సమావేశం నిర్వహించారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. దేవాలయ ప్రాశస్త్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించామన్నారు. వేదపాఠశాలను శాస్త్ర ప్రకారం తీర్చిదిద్దాలన్నారు. టూ వీలర్, ఫోర్ వీలర్, బస్ పార్కింగ్ లకు వేర్వేరు స్థలాలను కేటాయించాలని కొండా సురేఖ తెలిపారు.
వేదపాఠశాలను శాస్త్ర ప్రకారం తీర్చిదిద్దాలి – కొండా సురేఖ
0
189
Previous article
Latest Articles
నాని లైనప్ మారిందా..?
నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -
- Advertisement -


