వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ హీరోగా రాబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు.

ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను టీం విడుదల చేసింది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే ఎన్నో హింట్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఊరి వాతావరణం, ఆ చీకటి, గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి.. కత్తి పట్టుకుని దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్దంగా ఉన్నటువంటి న్యాయదేవత విగ్రహం కూడా కనిపిస్తోంది.

ఇలా పోస్టర్‌తోనే ఎంతో ఆసక్తికిని రేకెత్తించారు. ఇక ఈ మూవీని ఆల్రెడీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు చూపించారు. వారంతా కూడా సినిమాను మెచ్చుకున్నారు. మంచి కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించారని దర్శక నిర్మాతను ప్రశంసించారు. ఇక ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు : వరుణ్ సందేశ్, ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్దార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ్ కృష్ణ, రాజ్ కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ తదితరలు

సాంకేతికబృందం
బ్యానర్ : ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
నిర్మాత : రాజేష్ జగన్నాథం
రచన, దర్శకత్వం : రాజేష్ జగన్నాథం
సంగీతం : సంతు ఓంకార్
కెమెరామెన్ : రమీజ్ నవీత్
ఎడిటింగ్ : అనిల్ కుమార్
పీఆర్వో : సాయి సతీష్

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్