హైదరాబాద్ ఎస్సార్ నగర్ మెయిన్ రోడ్డు వద్ద గల పెట్రోల్ బంక్‌లో రౌడీషీటర్ రెచ్చిపోయాడు. పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్లిన బంటి సిబ్బంది దాడి చేశాడు. సిబ్బంది ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే అంతకుముందు బంటి తన టు వీలర్ వాహనంలో పెట్రోల్ పోయించుకునేం దుకు భారతి పెట్రోల్ పంపుకెళ్లి లైన్‌లో నిలిచున్నారు. ఈనేపథ్యంలోనే పెట్రోల్ పోసే వ్యక్తి తన డ్యూటీ అయిపోయిం దని..వేరే వ్యక్తి వచ్చి పోసే వరకు ఆగాలని కోరాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.పెట్రోల్ బంక్ సిబ్బంది, కస్టమర్ బంటిని కింద పడేసి కాళ్లు, చేతులతో తన్నిన వీడియోలు మాత్రం బయటకు వచ్చాయి. బంటే మొదట పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేయడంతో..తిరిగి పెట్రోల్ బంక్ సిబ్బంది అతనిపై దాడి చేశారని స్థానిక స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బంటిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఎస్సార్ నగర్‌లో ఓ పెట్రోల్ బంక్‌లో రెచ్చిపోయిన రౌడీషీటర్
0
244
Previous article
Next article
Latest Articles
జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం
జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


