TSPSC Paper Leak Case |తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ లో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం- సిట్ అధికారులు ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని విచారిస్తున్నారు. ఇప్పటికే పేపర్ లీకేజీలో ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు.. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్, సురేష్, రమేష్ లను ఐదు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఈ ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ఉన్నారు. ప్రశ్నాపత్రాలను తెలంగాణతో పాటు.. ఇతర దేశాల్లో ఉంటూ గ్రూప్-1 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి విక్రయించినట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్ లతో పేపర్ కొనుగోలు చేసిన వారికి ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు 15మందిని అరెస్ట్ చేయగా.. మరికొంతమందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు జరుగుతున్న కొద్ది ఈకేసులో అరెస్ట్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
ప్రవీణ్, రాజశేఖర్ గ్రూప్ 1 పేపర్ లీక్(TSPSC Paper Leak Case) చేసిన విషయం గుర్తించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ ఉన్నతాధికారులకు చెప్తారేమో అనే భయంతో షమీమ్, రమేష్ లను ప్రవీణ్, రాజశేఖర్ ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. మీకు కూడా గ్రూప్1 పేపర్ ఇస్తామని, మీరు కూడా ఎగ్జామ్ రాసి ఉద్యోగం పొందొచ్చని ఆశ చూపినట్లు సమాచారం. షమీమ్, రమేష్ ల నుంచే న్యూజిలాండ్ లో ఉన్న ప్రశాంత్ కు, సైదాబాద్ కు చెందిన సురేష్ కు పేపర్ లీక్ అయిందని సిట్ విచారణలో తేలింది. దర్యాప్తు చేస్తున్న కొద్ది విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.
Read Also: కేటీఆర్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు: సంజయ్
Follow us on: Youtube, Instagram, Google News