Corona Cases |ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. దేశంలో తగ్గుముఖం పడుతోందని అంతా ఆశించిన సమయంలో.. ఒక్కసారిగా కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్దిరోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు 40 శాతం పెరిగి.. 3,016కి చేరాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే లక్షా 10 వేల 522 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దాదాపు ఆరు నెలల తర్వాత ఈస్థాయి పెరుగుదల కనిపించింది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసుల సంఖ్య 13,509కి చేరాయి. రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతానికి చేరడంతో కొంత ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా 14 మరణాలను ప్రకటించింది. 2021 నుంచి 220 కోట్ల 65 లక్షల కరోనా టీకా డోసులు పంపిణీ అయినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఒక్క బుధవారమే 300 కరోనా కేసులు(Corona Cases) వెలుగుచూడటంతో.. అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. గత ఏడాది ఆగస్టు 31 తర్వాత.. అధిక కేసులు నమోదు కాదవడంతో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. వైద్య నిపుణులు, వైద్య శాఖ అధికారులతో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సమావేశమవుతారు.
Read Also: పేపర్ లీకేజీ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు.. దర్యాప్తులో సిట్ దూకుడు..
Follow us on: Youtube, Instagram, Google News