24.2 C
Hyderabad
Wednesday, December 6, 2023
spot_img

నేడు తెలంగాణకు ప్రధాని.. వస్తూనే ఆ రెండు పార్టీలకు చురకలు

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. అసమర్థ బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ పైనా ప్రజలు అంతే విసిగిపోయారన్నారు. రెండు పార్టీలకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేదన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.  అక్టోబర్ 1న మహబూబ్ నగర్‌కు వస్తున్నట్లు తెలిపిన ప్రధాని మోడీ.. బీజేపీ ర్యాలీలో ప్రసంగిస్తానని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో రూ. 13,500 కోట్లకుపైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ప్రధాని మోడీ పర్యటన ఇలా 
ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు ప్రధాని మోడీ. 1.35కి విమానాశ్రయం నుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్ నగర్ కు వెళ్తారు. మధ్యాహ్నం 2.05 గంటలకు పాలమూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.15-2.50 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగసభలో పాల్గొంటారు ప్రధాని మోడీ. అనంతరం హెలికాప్టర్‌లో సాయంత్రం 4.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడ్నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

మరోసారి కేసీఆర్ గైర్హాజరు 
కాగా, మరోవైపు, ఆదివారంనాటి ప్రధాని మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ మరోసారి దూరంగా ఉండనున్నారు. ఆయనకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఇంకా కోలుకోకపోవడంతో తెలంగాణ మంత్రివర్గ సమావేశం కూడా వాయిదా పడింది.

Latest Articles

థియేటర్ నుంచి కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తారు: నితిన్

నితిన్‌ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్