2015లో అసెంబ్లీ నుంచి గెంటేశారు.. ఇవాళ అదే అసెంబ్లీకి స్పీకర్‌

పదేళ్ల క్రితం బీజేపీకి చెందిన విజేందర్ గుప్తాను ఢిల్లీ అసెంబ్లీ నుంచి బయటకు గెంటేశారు. (నిజానికి విసిరివేయబడ్డారు) అప్పటి ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై.. ఓపీ శర్మ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది.

అప్పట్లో దీనికి సంబంధించిన విజువల్స్‌ బయటకు వచ్చాయి. ఇందులో .. అసెంబ్లీ లోపల తెల్లటి కుర్తా-పైజామా సెట్ ధరించిన విజేందర్‌ గుప్తాను అరడజను మంది మార్షల్స్ పైకి ఎత్తి ఉన్నారు. గుప్తా అరుస్తూ కనిపించారు. బీజేపీ నేత.. అసెంబ్లీ ఫర్నిచర్‌ను గట్టిగా పట్టుకుని, అరుస్తూ, పోరాడుతూ బయటకు తీసుకెళ్లడంపై ప్రతిఘటిస్తున్న దృశ్యాలు కనిపించాయి.

కట్‌ చేస్తే.. అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేస్తూ ఈ ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. అప్పట్లో అసెంబ్లీ నుంచి గెంటివేయబడ్డ విజేందర్‌ గుప్తా.. ఇవాళ అదే అసెంబ్లీ స్పీకర్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 2015 నుండి విజేందర్‌ గుప్తా వరుసగా రోహిణి స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు.

“ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు పార్టీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా బాధ్యతను నేను నెరవేరుస్తాను. సభలో ఆరోగ్యకరమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాను” అని విజేందర్‌ గుప్తా అన్నారు.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్