35.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

దేశంలో మొట్టమొదటి సారిగా ఇంటి నుంచి ఓటు వేసే విధానం

దేశంలో మొట్టమొదటి సారిగా ఇంటి నుంచి ఓటు వేసే విధానం కర్ణాటకలో పూర్తిస్థాయిలో అమలు కానుంది. ఈ మేరకు కర్ణాటక ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు (వీఎఫ్​హెచ్) విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రానికి రాలేని దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు.. ఇంటి నుంచే ఓటు వేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్‌కు 5 రోజులు ముందుగా వెలువరించే నోటిఫికేషన్‌ను అనుసరించి అర్హత ఉన్నవారు ‘ఫార్మ్ 12డి’ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో వీఎఫ్​హెచ్ విధానాన్ని పలు ఉప ఎన్నికలతో పాటు గుజరాత్ ఎన్నికల్లోనూ ఈసీ అమలు చేసిందని తెలిపారు.

ఈ విషయంపై కర్ణాటక ఈసీ ఏమన్నారంటే..?
80 ఏళ్లు పైబడిన వారు పోలింగ్ స్టేషన్​కు వచ్చి ఓటు వేయాలని ప్రోత్సహిస్తాం. పోలింగ్ కేంద్రానికి రాలేని వారి మాత్రం ఈ వెసులుబాటు ఉపయోగించుకోవచ్చు. పూర్తి ప్రక్రియను వీడియో తీస్తాం. దివ్యాంగుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించాం. సక్షమ్ అనే యాప్​లో తమ వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వొచ్చు. అందులో ఉన్న ఆప్షన్స్ ఎంచుకొని ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఓటింగ్ అంతా రహస్యంగానే జరుగుతుంది : కర్ణాటక ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్

Latest Articles

కెనడాలో కలకలం రేపుతున్న ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు

కెనడా గూఢచార సంస్థ ఐన కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ 2025 వార్షిక నివేదిక అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపింది. ఇదే అంశాన్ని మన దేశ ప్రధాని నరేంద్రమోడీ పలు మార్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్