శాద్‌నగర్–మక్తల్ అడవుల్లో అక్రమంగా జంతువులను వేటాడుతున్న గ్యాంగ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్, ఫారెస్ట్ అధికారుల సంయుక్త ఆపరేషన్‌లో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు జింకలు, నెమళ్లు, కుందేళ్లు, పిట్టలు, పావురాలను ఎయిర్ గన్స్‌తో వేటాడుతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 4 ఎయిర్ గన్స్, ఒక లైసెన్స్ రైఫిల్, 20 బుల్లెట్లు, ఎయిర్ గన్ పెలెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
అలాగే ఒక స్కార్పియో కారు, 8 మొబైల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ముజ్జఫర్ హుస్సేన్ కాగా, గ్యాంగ్‌లో ఒక ప్రొఫెషనల్ షూటర్ కూడా ఉన్నట్లు తెలిపారు.
గత ఏడాది నుంచి ఈ గ్యాంగ్ అక్రమ వేట కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వేట వీడియోలను మొబైల్‌లో రికార్డ్ చేసి, మాంసాన్ని తిన్న తర్వాత జంతువుల అవశేషాలను కాలువల్లో పారవేసినట్లు తెలిసింది.
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసి, నిందితులను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.


