35.2 C
Hyderabad
Saturday, May 9, 2026
spot_img

విజయ్ నిర్మాతలకు పండగే..

కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ఆఖరి సినిమా జన నాయగన్. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి కానీ.. సెన్సార్ కష్టాలు వలన ఇంత వరుకు రిలీజ్ కాలేదు. ఇప్పుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతున్న నేపథ్యంలో జన నాయగన్ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అయితే.. సెన్సార్ కష్టాలు వలన ఆగడమే కాకుండా.. ఆన్ లైన్ లో లీక్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు ఈ భారీ సినిమాకి లైన్ క్లియర్ అవ్వడం ఖాయం. దీంతో ఇప్పుడున్న ట్రెండ్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తే.. రికార్డు కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా లాస్ట్ సినిమా అని విజయ్ ప్రకటించారు. ఒకవేళ విజయ్ గెలవకపోతే మళ్లీ సినిమాల్లోకి వచ్చే వారేమో కానీ.. ఇప్పుడు గెలవడం.. ముఖ్యమంత్రి అవుతుండడంతో.. మళ్లీ విజయ్ సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు. అందుచేత సందర్భం కుదిరినప్పుడల్లా విజయ్ పాత సినిమాలను రీ రిలీజ్ రూపంలో విడుదల చేస్తే.. ఆయా నిర్మాతలకు భారీగా లాభాలు రావడం ఖాయం అంటున్నారు సినీ పండితులు.

శివకాశి, ఖుషి, లియో తదితర విజయ్ సినిమాలు ఎప్పుడు వచ్చినా జనాలు చూస్తారు. థియేటర్లలో మిస్ అవుతున్న విజయ్ ని మళ్ళీ తెర పై చూడాలంటే.. పాత సినిమాలు తప్పా వేరే ఆప్షన్ లేదు. అప్పట్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ల పాత సినిమాలు విడుదల చేస్తే.. డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలు తీసుకువచ్చాయి. ఇప్పుడు విజయ్ పాత సినిమాలు కూడా అదే రేంజ్ లో నిర్మాతలకు లాభాలు అందిస్తాయని టాక్. సో.. విజయ్ నిర్మాతలకు పండగే.

Latest Articles

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… మోదీతో రేవంత్ ప్రత్యేక భేటీ

హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక పరిణామాలకు రంగం సిద్ధమైంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi) హైదరాబాద్‌కు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక వినతులు సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్