బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( K. T. Rama Rao) రాష్ట్ర మంత్రులకు సవాల్ విసిరారు. సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్‌లో భారీ స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు. మార్క్‌ఫెడ్ ద్వారా తీసుకున్న రూ.22,700 కోట్ల అప్పును సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్‌కు మళ్లించారని తెలిపారు. ఇప్పటికే ఆ సంస్థపై రూ.1.06 లక్షల కోట్ల అప్పు ఉందని, అందుకే ఇప్పుడు ఎవరూ అప్పులు ఇవ్వడం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. తన ఆరోపణలపై దమ్ముంటే మంత్రులు చర్చకు రావాలని సవాల్ చేశారు. వెంటనే రైతుల నుంచి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎల్లుండి నుంచి పోరాటాలు ప్రారంభిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌లో అవినీతి… జనగామ మంత్రులకు కేటీఆర్ సవాల్
0
86
Latest Articles
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉద్యోగులకు రెండు డీఏలు, ఎల్‌నినో...
- Advertisement -
- Advertisement -


