కొత్త ఎమ్మెల్యేలతో విజయ్ భేటీ.. రేపు గవర్నర్ ను కలిసే చాన్స్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లతో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో విజయ్ చెన్నైలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎంపిక, ప్రభుత్వం ఏర్పాటు అంశాలపై చర్చించారు. బుధవారం విజయ్‌ గవర్నర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది.

విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల్లో గెలవడంతో ఆయన ఏ నియోజకవర్గాన్ని కొనసాగుతారన్న ఆసక్తి నెలకొంది. పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగి, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం.

అయితే పూర్తి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం ఇతర పార్టీల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Latest Articles

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్