సూపర్‌స్టార్ రజినీకాంత్ దేశ ఉపాధ్యక్ష పదవిపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. దేశవిదేశాల్లోఅభిమానుల్ని స్వంతం చేసుకున్న రజినీకాంత్… ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చలకు దారి తీస్తుంది. జాతీయస్థాయిలో తెలుగుఖ్యాతిని, తెలుగు గొప్పదనాన్ని చాటిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుణ్ని పొగిడే క్రమంలో ఈవ్యాఖ్యలు చేశాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వెంకయ్యతో కలిసి వేదిక పంచుకున్న రజినీ.. వైస్ ప్రెసిడెంట్ పోస్టు పవర్ లెస్ అని తేల్చేశారు. వెంకయ్యలాంటి గొప్ప నాయకుడికి.. ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చి రాజకీయాలకు దూరం చేయడం తనకు నచ్చలేదన్నారు. సాధారణంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి పదవులు చేపట్టడమంటే.. ఇండియాలో ప్రతక్షరాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్టేనని అన్నారు. సూపర్ స్టార్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు ఏమంటారో వేచిచూడాలి మరి.
సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు
వెంకయ్యకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం నాకు నచ్చలేదు.. గొప్పనాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారు.. ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవు చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయి.. నేను ఉపరాష్ట్రపతి పదవిని కించపరచడం లేదు.. వెంకయ్యనాయుడు మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగివుంటే బాగుండేది : నటుడు రజనీకాంత్