38.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

ముగ్గురు దిగ్గజాలను దెబ్బకొట్టిన బీజేపీ.. పదవులు పోగొట్టుకున్న కేజ్రీవాల్, మమత, స్టాలిన్..

దేశ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక విలక్షణమైన వ్యూహం విపక్ష పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రత్యర్థి పార్టీల కంచుకోటలను బద్ధలు కొట్టడానికి కేవలం ప్రజాక్షేత్రంలోనే కాకుండా, ‘టెక్నికల్’ అంశాల్లోనూ ఆరితేరిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాలకు చెందిన ముగ్గురు దిగ్గజ ముఖ్యమంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లోనే పరాజయం పాలుకావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరి ఓటమికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కంటే, ఓట్ల జాబితాలో జరిగిన భారీ మార్పులే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

2025లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఊహించని పరాజయాన్ని మూటగట్టుకున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కేవలం 4,000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గంలో ఏకంగా 38,000 ఓట్లు తొలగించబడ్డాయి. తొలగించిన ఓట్ల సంఖ్యతో పోలిస్తే, ఓటమి మార్జిన్ చాలా తక్కువగా ఉండటం గమనార్హం. వ్యూహాత్మకంగా ఆప్ మద్దతుదారుల ఓట్లనే ఏరివేసారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఇదే తరహా వ్యూహానికి బలైపోయారు. భబానీపూర్ నియోజకవర్గంలో ఆమె సుమారు 15,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కానీ, ఆ నియోజకవర్గ పరిధిలో రికార్డు స్థాయిలో 51,000 ఓట్లు ఓటర్ల జాబితా నుండి మాయమయ్యాయి. మమతకు పట్టున్న ప్రాంతాల్లోనే ఈ ఓట్ల తొలగింపు జరగడం బీజేపీ రాజకీయ చతురతకు నిదర్శనమని విమర్శకులు అంటున్నారు. దీంతో బెంగాల్ పులి సైతం సొంత గడ్డపై మోకరిల్లాల్సి వచ్చింది.

ఇటు ఇక దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో డిఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఓటమి మరింత విస్తుగొలుపుతోంది. కొళత్తూరు నియోజకవర్గంలో ఆయన 8,795 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇక్కడ తొలగించబడిన ఓట్ల సంఖ్య అక్షరాలా 1.02 లక్షలు. మెజారిటీ కంటే తొలగించిన ఓట్లు పదింతలు ఎక్కువగా ఉండటం చూస్తుంటే, క్షేత్రస్థాయిలో ఎంతటి సూక్ష్మ వ్యూహాన్ని అమలు చేశారో అర్థం చేసుకోవచ్చు.

వరుస విజయాలతో ఊపుమీదున్న బీజేపీ, తాజాగా పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. ఈ రాష్ట్రాల్లో గెలుపు గుర్రం ఎక్కిన కమలనాథులు ఇప్పుడు తమ తదుపరి గురిని తెలంగాణపై పెట్టారు. తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పటికే ఆ పార్టీ అగ్రనాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన ‘ఓట్ల సమీకరణ’, ‘తొలగింపు’ వ్యూహాలను ఇక్కడ కూడా ప్రయోగిస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఏది ఏమైనా, టెక్నికల్‌గా ఓట్ల తొలగింపు సరైనదేనని అధికారులు చెబుతున్నా, రాజకీయంగా మాత్రం ఇది విపక్షాలను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. రాష్ట్రానికో రకంగా గేర్ మారుస్తూ బీజేపీ సాగిస్తున్న ఈ ‘పొలిటికల్ గేమ్’ మున్ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Latest Articles

నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee) ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనని స్పష్టంగా ప్రకటించారు. తమ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్