35.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

చరణ్‌తో మూవీ చేయబోతున్న ఎన్టీఆర్ నిర్మాత..?

సామాన్య ప్రేక్షకులకే కాదు.. సినీ ప్రముఖులకు కూడా అభిమాన హీరోలు ఉంటారు. ఇండస్ట్రీలో ఓ యంగ్ ప్రొడ్యూసర్ కి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. యంగ్ టైగర్ తో సినిమా అంటే.. ఎంతైనా ఖర్చు పెడతాడు.. ఎంత రేటు పెట్టైనా తారక్ సినిమా రైట్స్ దక్కించుకుంటాడు. ఎన్టీఆర్ ని ఇంతగా అభిమానించే ఈ యంగ్ ప్రొడ్యూసర్ తో సినిమా చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ఓకే చెప్పారనే వార్త ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ యంగ్ అండ్ యంగ్ టైగర్ ప్రొడ్యూసర్ ఎవరు..? చరణ్‌ తో క్రేజీ మూవీ పట్టాలెక్కేది ఎప్పుడు..?

యంగ్ టైగర్ అంటే.. అంతలా అభిమానించే యంగ్ ప్రొడ్యూసర్ ఎవరో కాదు.. సూర్యదేవర నాగవంశీ. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద సమేత అనే సినిమాను నిర్మించారు. ఆతర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర, వార్ 2 సినిమాలను నాగవంశీనే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ మూవీ రైట్స్ ను భారీ రేటుకు తీసుకున్నారంటే కారణం ఎన్టీఆర్ పై ఉన్న అభిమానమే. ఇప్పుడు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ డైరెక్షన్లో భారీ మైథలాజికల్ మూవీని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నాగవంశీ.. ఇప్పుడు చరణ్ తో భారీ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. గత కొంత కాలంగా నాగవంశీకి బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం కలిసి రావడం లేదు. గత సంవత్సరం కింగ్ డమ్, మాస్ జాతర.. ఈ సంవత్సరం ఫంకీ చిత్రాలతో వరుసగా ప్లాపులు రావడంతో భారీగా నష్టాలు వచ్చాయి. సంక్రాంతికి వచ్చిన అనగనగా ఒక రాజు మూవీ మాత్రం సక్సెస్ అయ్యింది. అయితే.. భారీ నష్టాలు రావడంతో ఈసారి భారీ విజయం సాధించేలా క్రేజీ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట నాగవంశీ.

ఈ క్రమంలోనే నాగవంశీ చరణ్ కాల్ షీట్స్ సంపాదించాడట. చరణ్ ప్రస్తుతం సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత చరణ్‌.. నాగవంశీ బేనర్లోనే సినిమా చేయబోతున్నాడని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయితే కనుక సితార బ్యానర్లో ఇదే అతి పెద్ద సినిమా అవుతుంది. ప్రస్తుతం నాగవంశీ.. చరణ్‌ కు సరిపోయే కథను అందించే రైటర్ అండ్ డైరెక్టర్ కోసం సెర్చింగ్లో ఉన్నారని టాక్. మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎవరితో సెట్ అవుతుందో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్