35.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. బావిలో పడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంగ్టి మండలం బోర్గి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమార్తెలు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, తల్లి సావిత్రిబాయి తన ఇద్దరు కుమార్తెలు నిఖిత (13), నందిని (12)తో కలిసి దుస్తులు ఉతికేందుకు గ్రామంలోని బావి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ముగ్గురూ బావిలో పడిపోయినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బావి నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు చిన్నారులు ఇలా ఒకేసారి మృతి చెందడంతో బోర్గి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు.

Latest Articles

హీటెక్కిన తమిళనాడు పాలిటిక్స్‌.. రేపు లోక్‌భవన్‌ ముట్టడికి పిలుపు

తమిళనాడు పాలిటిక్స్ హీటెక్కాయి. రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. రెండు సార్లు గవర్నర్ ను విజయ్ కలిసినప్పటికి ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత వీడలేదు. అటు గవర్నర్‌ వైఖరిని నిందిస్తూ కాంగ్రెస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్