37.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం

కేరళలో అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేరళ స్టేట్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కేరళ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ చేపట్టబోయే కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఈ ఫ్యాన్స్ మీటింగ్ లో అసోసియేషన్ ను మరింత బలపర్చడం, విస్తరించడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులకు చేరువకావడంపై డిస్కషన్స్ చేశారు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్ఏ) దేశంలో అతిపెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ గా ఏర్పడింది. అన్ని ప్రాంతాల్లో ఏఏఎఫ్ఏ తమ కార్యక్రమాలను చేపడుతోంది. సౌత్ ఇండియాలో సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇకపై నార్త్ ఇండియాలోనూ తమ యాక్టివిటీస్ చేసేందుకు సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జూన్ 4న సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు చేయబోతోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ ఈ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు.

Latest Articles

పాలకోవాలో విషం పెట్టి భార్య హత్య

కడప జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భర్త కిరణ్‌కుమార్ ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించి, అరెస్టు చేశారు. కేసు వివరాలను ఏఎస్పీ విభు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్