సరిహద్దుల్లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇప్పటికే కుదిరిన ఒప్పందం ప్రకారం వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు తగ్గించడంలో భాగంగా.. భారత్-చైనాలు తమ బలగాలను వెనక్కు రప్పించడం మొదలుపెట్టాయి. తూర్పు లడఖ్ సెక్టార్‌లోని డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కు మళ్లినట్లు వెల్లడించాయి మన దేశ రక్షణ వర్గాలు. సైనిక సామాగ్రితోపాటు ఇతర పరికాలను వెనక్కు తీసురావడంతోపాటు ఇక్కడే ఏర్పాటు చేసిన టెంట్లు, ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు.
ఎల్‌ఓసీ వెంట గస్తీని మళ్లీ ప్రారంభించే అంశంపై భారత్, చైనా మధ్య కొన్ని రోజుల క్రితమే ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం గల్వాన్ ఘర్షణకు ముందు నాటి పరిస్థితి వాస్తవాధీన రేఖ వెంబడి కొనసాగనుంది. ఇదే అంశంపై తాజాగా జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత్, చైనా అధినేతలు స్పందించారు. ఓ అధికారిక ప్రకటన రావడంతో ఇరు దేశాలు తమ తమ బలగాలను వెనక్కు రప్పిస్తున్నాయి.