రతన్‌టాటాను మరోసారి గుర్తుచేసుకున్న ప్రజలు

రతన్‌టాటా మంచి మనసును మరోసారి గుర్తు చేసుకుంది యావత్ భారతం. ఇందుకు కారణం ఆయన చూపిన ఉదారతే. నిజమే.. రతన్‌ టాటా రాసిన వీలునామాలో తన పెంపుడు కుక్కకు సైతం వాటా ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నో ఏళ్లపాటు తనకు తోడుగా ఉన్న పెంపుడు కుక్క టిటో సంరక్షణ కోసం అంటూ తన ఆస్తుల్లో కొంత వాటా ఇచ్చారు రతన్‌ టాటా. ఆ మూగజీవిని ఎలా చూసుకోవాలో చెబుతూ ఏకంగా నిబంధనలే రూపొందించారాయన.

రతన్‌ టాటా జీవించి ఉన్న రోజుల్లో మూగజీవాల పట్ల ఆయన ఎంతో కరుణ చూపేవారు. ప్రత్యేకించి వీధి శునకాలపై ఆయన చూపించే ప్రేమ అపారమైనదనే చెప్పాలి. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన వాటి రక్షణకు ఎంతో పాటుపడేవారు. అలాంటి రతన్‌ టాటా.. తన వీలునామాలో పెంపుడు కుక్కకు వాటా కేటాయించడంతో మరోసారి అందరూ టాటా మంచి మనసును గుర్తుచేసుకుంటున్నారు.

Latest Articles

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య

హైదరాబాద్‌లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్