మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో.. మంత్రి కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది. కేటీఆర్ గురించి ఇంకెప్పుడు అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యుట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆదేశించింది. మంత్రి కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కోర్టును ఆశ్రయించిన కేటీఆర్.. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం మంత్రి కొండాపై మండిపడింది.