ములుగు జిల్లాలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ కళాశాలల బాలుర వసతి గృహాన్ని..మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి భోజనం, వసతి సదుపాయాల గురించి అడిగితెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం కోసం అధికారులు ఎప్పటికప్పుడు గృహాలను సందర్శిస్తున్నారని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదవటం కాకుండా ఇష్టంతో చదవాలన్నారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని విద్యార్థులకు మంత్రి సూచించారు. వసతి గృహాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి గాని, కలెక్టర్ దృష్టికి గాని తీసుకురావాలన్నారు. కళాశాలలు, పాఠశాలల వసతి గృహాలను బలోపేతం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు మంచి ఫలితాలను సాధించాలని మంత్రి కోరారు.