35.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

రేపటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

   లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు రేపటితో గడువు ముగియనుంది. ఇటు తెలంగాణ లోక్‌సభ, అటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు రేపే ఆఖరి తేదీ. రెండు రోజులే నామినేషన్లకు సమయం ఉండటంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 415 నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే 128 నామినేషన్లు దాఖలయ్యాయి.

    ఏపీలో 25 పార్లమెంట్‌ సెగ్మెంట్లకు ఇప్పటి వరకు 417 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 2 వేల 350 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలంగాణ, ఏపీ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగను న్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, ఝూర్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్‌ జరగనుంది. వీటితో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇవాళ్టికి ఆరో రోజుకు చేరుకుంది. రేపటి వరకు నామినేషన్లు స్వీకరించి ఈనెల 26న వాటిని పరిశీలించనున్నారు. అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 29 వరకు గడువు ఉంది.

Latest Articles

ఆ ఇద్దరు భామలు చేయాల్సిన పాత్రలో.. మృణాల్..?

ఇండస్ట్రీలో ఒకరితో సినిమా చేయాలనుకుంటే.. మరొకరితో సెట్ అవ్వడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఇప్పుడు అలాగే జరిగింది. ఇంతకీ విషయం ఏంటంటారా..? మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌, లేదా ఫిదా బ్యూటీ సాయిపల్లవితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్