35.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

జాన్వీ, భాగ్యశ్రీ.. దశ తిరిగేనా..?

జాన్వీ కపూర్, భాగ్యశ్రీ.. ఈ ఇద్దరూ బ్యూటీలు.. సక్సెస్ కోసం తపిస్తున్నారు. అయితే.. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ భామలు ఇప్పుడు తెగ టెన్షన్ పడుతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా.. ఈ ఇద్దరు భామలకు కెరీర్ టర్నింగ్ పాయింట్ కానుందా..? లేదా..? అనేది తేలేది ఒకే నెలలో కావడంతో సినీ జనాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ.. జాన్వీ, భాగ్యశ్రీ ఫ్యూచర్ డిసైడ్ చేసే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడు..? ఈసారైనా ఈ బ్యూటీల ఫేట్ మారేనా..?

జాన్వీ కపూర్ బాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంట్రీ ఇస్తే.. అక్కడ ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి సక్సెస్ రాలేదు. ఇది నిజంగా నిజం. పాత్రకు తగ్గట్టుగా నటిస్తుందనే పేరు అయితే వచ్చింది కానీ.. చెప్పుకోదగ్గ కమర్షియల్ సక్సెస్ లు రాలేదు. అందుకనే ఈ బ్యూటీ సౌత్ పై ముఖ్యంగా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. దేవర సినిమాతో జాన్వీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ నటించింది. అయితే.. ఇందులో జాన్వీ క్యారెక్టర్ కు అంతగా ప్రాధాన్యత లేదు. కేవలం పాటలకే పరిమితం అయ్యింది. దీంతో.. ఈ బ్యూటీకి ఆశించినంతగా పేరు రాలేదు.

ఇప్పడు పెద్ది సినిమాలో నటించింది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ జంటగా నటించింది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ మార్చి 27న రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరుకు రిలీజ్ కాలేదు. జూన్ 4న పెద్ది థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా పై జాన్వీ చాలా ఆశలు పెట్టుకుంది. అయితే.. పెద్ది బ్లాక్ బస్టర్ అయితే.. జాన్వీకి టాలీవుడ్లో మరిన్ని ఆఫర్స్ రావడం.. మరింత క్రేజ్ పెరగడం ఖాయం. అందుకనే.. ఈ మూవీ సక్సెస్ అవుతుందో లేదో అని తెగ టెన్షన్ పడుతుందట.

జాన్వీ వలే టెన్షన్ పడుతున్న మరో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఈ అమ్మడు మిస్టర్ బచ్చన్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ సక్సెస్ ఇస్తుంది అనుకుంటే.. డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత ఆమె నటించిన కింగ్ డమ్, ఆంధ్రా కింగ్ తాలూకా, కాంతా చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు భాగ్యశ్రీ నటించిన లెనిన్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ కి జంటగా భాగ్యశ్రీ నటించింది. ఈ సినిమా మే 1న రిలీజ్ కావాలి కానీ.. జూన్ 26కి వాయిదా పడింది. ఈ మూవీ పై భాగ్యశ్రీ చాలా ఆశలు పెట్టుకుంది. అందుకనే.. రిజెల్ట్ ఎలా వస్తుందో అని తెగ టెన్షన్ పడుతుందట. ఇలా జాన్వీ, భాగ్యశ్రీ తెగ టెన్షన్ పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. పెద్ది, లెనిన్ చిత్రాలు ఈ భామలిద్దరికి సక్సెస్ అందిస్తాయో లేదో చూడాలి.

Latest Articles

కాకినాడ ఎంపీకి టైం ఎప్పుడు దొరుకుతుంది?

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఇప్పుడు సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. తనకున్న రాష్ట్ర స్థాయి బాధ్యతల వల్ల పవన్ కళ్యాణ్ స్థానికంగా ఉండలేకపోవడంతో.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్