సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్శిల్ హీరో కమల్ హాసన్.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో మూవీ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆతర్వాత ఈ క్రేజీ మూవీ డైరెక్టర్ ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. ఆతర్వాత సస్పెన్స్ కి తెర దించుతూ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ క్రేజీ మల్టీస్టారర్ ను డైరెక్ట్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు ఈ క్రేజీ మూవీకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ.. ఏంటా షాకింగ్ న్యూస్.. ? ఈ క్రేజీ, భారీ పాన్ ఇండియా మూవీ ఎలా ఉండబోతుంది..? ఎప్పుడు సెట్స్ పైకి రానుంది..?
రజినీకాంత్, కమల్ హాసన్.. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే.. బాక్సాఫీస్ దగ్గర నువ్వా..? నేనా..? అనేట్టుగా పోటీపడినా..కెరీర్ ఆరంభంలో ఓ పదిహేను సినిమాల్లో కలిసి నటించడం విశేషం. అయితే.. ఇప్పుడు ఓ నలభై ఏళ్ల తర్వాత.. ఈ లెజండ్స్ ఇద్దరూ కలిసి నటించనున్నారని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ క్రేజీ మల్టీస్టారర్ సెట్స్ పైకి వస్తుందా అని ఈ ఇద్దరు హీరోల అభిమానులే కాకుండా.. సామాన్య ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ క్రేజీ మల్టీస్టారర్ ను తెరకెక్కించే డైరెక్టర్ అంటూ లోకేష్ కనకరాజ్, సుందర్ సి, ప్రదీప్ రంగనాథ్… ఇలా కొంత మంది దర్శకుల పేర్లు ప్రచారలోకి వచ్చాయి. ఆతర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ ఈ క్రేజీ మూవీని డైరెక్ట్ చేయనున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఈ క్రేజీ మూవీని అనౌన్స్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్టు కోలీవుడ్, టాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే.. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత భారీ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే.. ఈ బడ్జెట్ బయటకు వచ్చిన తర్వాత అసలు కథ ఏంటి..? అంత బడ్జెట్ పెడుతున్నారంటే.. విజువల్ వండర్ అనిపించేలా భారీగా గ్రాఫిక్స్ తో ఉండేలా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారా..? అనే అనుమానాలు మొదలయ్యాయి.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. 600 కోట్ల బడ్జెట్లో రజినీ, కమల్, నెల్సన్ దిలీప్ కుమార్, అనిరుథ్..తో పాటు ఇందులో నటించే మిగిలిన స్టార్స్ కు కలిపి ఎక్కువ భాగం రెమ్యూనరేషన్స్ కే ఖర్చు అవుతుందట. ఇక కథ విషయానికి వస్తే.. రజినీ, కమల్ ఇద్దరూ చాలా గ్యాంగ్ స్టర్ డ్రామాల్లో నటించారు కాబట్టి.. ఇద్దరూ కలిసి గ్యాంగ్ స్టర్ తరహా సినిమా కాకుండా.. ఆడియన్స్ ని ఎంటర్ టైనర్ చేసే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ చేయాలి అనుకుంటున్నారట. ఈ భారీ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్‌కు చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆగష్టులో ఈ క్రేజీ మల్టీస్టారర్ ను సెట్స్ పైకి తీసుకురానున్నారని సమాచారం. మరి.. రజినీ, కమల్ కలిసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.


