34.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

ఆ ఇద్దరు భామలు చేయాల్సిన పాత్రలో.. మృణాల్..?

ఇండస్ట్రీలో ఒకరితో సినిమా చేయాలనుకుంటే.. మరొకరితో సెట్ అవ్వడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఇప్పుడు అలాగే జరిగింది. ఇంతకీ విషయం ఏంటంటారా..? మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌, లేదా ఫిదా బ్యూటీ సాయిపల్లవితో ఓ పాత్ర చేయించాలి అనుకుంటే కుదరలేదు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ను బాలీవుడ్ బ్యూటీతో చేయించనున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. ఆ సినిమా ఏంటి..? ఆ.. బాలీవుడ్ బ్యూటీ ఎవరు..? అసలు తెర వెనుక ఏం జరిగింది..?

బలగం అనే చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించిన డైరెక్టర్ వేణు.. ఎల్లమ్మ తన రెండో సినిమాగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాతో హీరోగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ను పరిచయం చేస్తుండడం విశేషం. ఇక ఈ క్రేజీ మూవీలో కథానాయిక పాత్రను మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తో చేయించాలి అనుకున్నారు. దాదాపుగా ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నటించడం ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది.. అయితే.. దేవిశ్రీకి జంటగా నటించనని ఈ బ్యూటీ చెప్పిందనే వార్త ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపించింది. ఆతర్వాత ఫిదా బ్యూటీ సాయిపల్లవితో ఈ పాత్రను చేయించనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే.. బాలీవుడ్లో రామాయణ సినిమాలో బిజీగా ఉండడం వలనో ఏమో కానీ.. సాయిపల్లవి కూడా ఎల్లమ్మ సినిమాలో నటించేందుకు నో చెప్పిందని టాక్ వచ్చింది.

కథానాయిక ఎవరనేది కన్ ఫర్మ్ కాకుండానే ఎల్లమ్మ సెట్స్ పైకి వచ్చింది. దేవిశ్రీ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ క్రేజీ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ నటిస్తుందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. సీతారామం, హాయ్ నాన్న, డెకాయిట్ చిత్రాలతో సక్సెస్ సాధించి మృణాల్ తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. పైగా పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లో బాగా నటించగలదు అనే పేరు తెచ్చుకుంది. అందుకనే ఈ బాలీవుడ్ బ్యూటీని ఫైనల్ చేసారని సమాచారం. ఇదే కనుక నిజమైతే… ఎల్లమ్మ సినిమాకి మృణాల్ ప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు, శిరీష్ ఆ క్రేజీ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఎల్లమ్మ గ్లింప్స్ లో వేప ఆకులు, పసుపు, కుంకుమ, గజ్జెల మోత.. ఇలా డిఫరెంట్ గా చూపించి మూవీ పై అంచనాలు పెంచేశారు. ఇప్పుడు మృణాల్ ఇందులో నటిస్తుందని వార్తలు వచ్చినప్పటి నుంచి పర్ ఫెక్ట్ ఛాయిస్ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే.. మృణాల్ కన్ ఫర్మ్ అయినట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సివుంది. మరి.. త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్