ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. ఆనందంలో విజయ్ ఫ్యాన్స్

తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.

గవర్నర్ గ్రీన్ సిగ్నల్

టీవీకే చీఫ్‌ విజయ్‌ ఇవాళ మరోసారి గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. విజయ్ రెండోసారి గవర్నర్‌ను కలిసి, తమకు ఉన్న మద్దతు లేఖలను సమర్పించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్‌ను కోరారు.

విజయ్ సమర్పించిన మద్దతు లేఖలు , ప్రస్తుత సంఖ్యాబలంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. విశ్వాస పరీక్ష ద్వారా బలాన్ని నిరూపించుకోవడానికి విజయ్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో తమిళనాడులో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలుకానుంది.

గవర్నర్‌తో వరుస భేటీలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం, టీవీకే అధినేత విజయ్ రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు లోక్ భవన్ వెళ్ళి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. నిన్నటి భేటీలో ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సంఖ్యాబలంపై గవర్నర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మెజార్టీకి అవసరమైన 118 మంది సభ్యుల మద్దతు స్పష్టంగా ఉన్నప్పుడే రావాలని గవర్నర్ సూచించినట్లు వార్తలు వచ్చాయి.

తొలుత సంఖ్యాబలం విషయంలో సందిగ్ధత నెలకొన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

Latest Articles

ముగిసిన సీఐ నాగరాజు సిట్‌ విచారణ

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజు సిట్‌ విచారణ ముగిసింది. ప్రభుత్వాసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో నాగరాజును 2వ AJS కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్