డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ రవిబాబు. తాజాగా రవిబాబు తెరకెక్కించిన రేజర్ మూవీ ఈ నెల 8న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో రవిబాబు చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ఒక్క హిట్ వస్తే చాలు.. హీరోల బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది అంటూ అసలు నిజం బయటపెట్టారు. ఈ కామెంట్స్ ఓ పెద్ద స్టార్ ని దృష్టిలో పెట్టుకుని చేసారని సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఇంతకీ.. రవిబాబు కామెంట్స్ ఏ స్టార్ హీరోను ఉద్దేశ్యించి చేశారు..? అసలు.. రవిబాబు అలా అనడానికి కారణం ఏంటి..?
అల్లరి సినిమాతో యాక్టర్ రవిబాబు కాస్తా.. డైరెక్టర్ రవిబాబు అయ్యారు. ఆతర్వాత అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ, అనసూయ, నచ్చావులే, అమరావతి, అవును.. ఇలా రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వైవిధ్యమైన కథా చిత్రాలను అందించారు. ఈ సినిమాలు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రావడంతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా రవిబాబు మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్, హర్రర్ సినిమాల స్పెషలిస్ట్ గా రవిబాబు తనదైన మార్క్ చూపించారు.
ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత రేజర్ అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నెల 8న రేజర్ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా రవిబాబు ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో రవిబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్క హిట్ వస్తే చాలు హీరోల బాడీ లాంగ్వేజ్ మారిపోతుందని.. కళ్లజోడు పెట్టుకుని బిల్డప్పులు కొడతారు అన్నారు. అయితే.. ఈ కామెంట్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఉద్దేశ్యించి అన్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీని పై బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది కాస్తా వైరల్ అవ్వడంతో రవిబాబు స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని.. ఎవర్నీ పర్సనల్ గా టార్గెట్ చేయలేదు. బన్నీని ఉద్దేశ్యంచి అనలేదు. బన్నీ చిన్నప్పటి నుంచి తెలుసు.. ఇండస్ట్రీలో సాధారణంగా జరుగుతున్న విషయాల గురించి చెప్పాను అంతే.. అని క్లారిటీ ఇచ్చారు.
పుష్ప, పుష్ప 2 సినిమాలో.. తగ్గేదేలే అంటూ బన్నీ డైలాగ్ చెప్పడం.. ఆ డైలాగ్ పాపులర్ అవ్వడం తెలిసిందే. అయితే.. ఈ సినిమా రిలీజ్ తర్వాత బన్నీ బయట కూడా అలాగే యాటిట్యూడ్ చూపిస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఇటీవల బన్నీని కలవాలంటే.. ప్రోటోకాల్ పాటించాలి అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఆతర్వాత అలాంటిది ఏమీ లేదని బన్నీ టీమ్ క్లారిటీ ఇచ్చారు. అయితే.. రవిబాబు చేసిన కామెంట్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఉద్దేశించే అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరగడంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉంటే.. రవిబాబు ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ లేక వెనకబడ్డాడు. మరి.. రేజర్ మూవీతో మళ్లీ ఫామ్లోకి వస్తాడో లేదో చూడాలి.


