సీఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై సందీప్ కాకుల నిర్మాతగా స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘డ్రీమ్ క్యాచర్’. ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రాంరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ‘డ్రీమ్ క్యాచర్’తో సందీప్ కాకుల డైరెక్టర్‌గా పరిచయం అవుతుండడం సంతోషంగా ఉందని, ఫస్ట్ లుక్, టీజర్ బాగున్నాయని అతిథులు తెలిపారు.
ఈ సందర్భంగా డైరెక్టర్, ప్రొడ్యూసర్ సందీప్ కాకుల మాట్లాడుతూ..‘‘నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేనే దర్శకుడిగా, ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా తీశా. ఈ ఏడాది మంచి చిత్రంగా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో ‘డ్రీమ్ క్యాచర్’ కచ్చితంగా చేరుతుంది. క్లైమాక్స్ చిత్రీకరించిన తీరు చూస్తే హౌరా అనిపించే విధంగా ఉంటుంది.’’ అని చెప్పారు.
ఈ చిత్రంలో నటించడం చాలా సంతృప్తినిచ్చిందని నటులు ప్రశాంత్ కృష్ణ అన్నారు. ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడికి హీరోయిన్ అనీషా ధామ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రోహన్ శెట్టి, కెమెరామెన్ ప్రణీత్ గౌతమ్ నంద తదితరులు పాల్గొని సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
నటీ నటులు:
ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రాంరెడ్డి , ఐశ్వర్య హోలక్కల్, తదితరులు
సాంకేతిక వర్గం:
పీఆర్వో: శ్రీపాల్ చొల్లేటి, డి.ఐ: శ్రీనివాస్ మామిడి, వి.ఎఫ్.ఎక్స్: శ్రీకాంత్ శాఖమూరు, సంగీతం: రోహన్ శెట్టి, ఛాయాగ్రహణం: ప్రణీత్ గౌతమ్ నంద, కూర్పు: ప్రీతం గాయత్రి, నిర్మాత: సందీప్ కాకుల, రచన, దర్శకత్వం: సందీప్ కాకుల.