లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 150 సీట్లు మాత్రమే గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఎస్పీ అధినేత అఖిలేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్ని గెలుస్తామో ముందే జోష్యం చెప్పలేనని రాహుల్ అన్నారు. 15 నుంచి 20 రోజుల క్రితం బీజేపీ లోకసభ ఎన్నికల్లో 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నానని, కానీ, బీజేపీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుందని చెప్పారు. తమకు అనన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అందాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లో చాలా బలమైన కూటమి ఉందని, తమకు మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రాడ్యుయేట్లు, డిప్లొమా చేసినవారికి అప్రెంటిస్‌షిప్ హక్కును కల్పిస్తామని రాహుల్ అన్నారు. యువత బ్యాంకు ఖాతాలో ఏడాదికి లక్ష రూపాయలు జమ చేస్తామన్నారు.
బీజేపీ వచ్చేది 150 సీట్లు మాత్రమే – రాహుల్ గాంధీ
0
235
- Tags
- Rahul Gandhi
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


