ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామ కథ చెబుతోందని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముడి పాలనే కారణమని చంద్రబాబు అన్నారు. అలాంటి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుందని.. సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభిక్షమైన, సుఖశాంతులతో కూడిన రామరాజ్యం లాంటి పాలన రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో రామరాజ్యం వస్తుంది – చంద్రబాబు
0
315
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


