25.2 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

హస్తం నేతలకు చిక్కులు తప్పవా?

కాంగ్రెస్ నేతల అంచనాకు అనుకున్నట్లుగా గ్రౌండ్ రియాలిటీ కనిపించడం లేదా? పద్దతి మార్చుకోకపోతే హస్తం నేతలకు చిక్కులు తప్పవా? పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగొలు కాంగ్రెస్ పార్టీ నేతలని హెచ్చరించారా? ఇటీవల సునీల్ చేసిన సర్వే రిపోర్ట్ పార్టీలో చర్చగా మారిందా? ఇంతకీ సునీల్ కనుగోలు రిపోర్ట్ లో ఏముంది?

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని కసరత్తు చేస్తుంది. మొన్నటి వరకు 14 సీట్లు గెలవడమే తమ లక్ష్యం అనుకున్న కాంగ్రెస్ పార్టీ తమ టార్గెట్ పరిది పెంచి మిషన్15 అంటూ ముందుకు వెళ్తోంది. ఇటీవల కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణకి వచ్చి పార్టీ వ్యూహం, ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్ళారు. కాంగ్రెస్ మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను తెలపడంతో పాటు ఎంపీ అభ్యర్థులతో వన్ టూ వన్ మాట్లాడి ఆ నియోజకవర్గ పరిస్థితులు, అభ్యర్థులకు కావాల్సిన సహకారం తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేశారు.

కేసీ వేణుగోపాల్ సడెన్ విజిట్ పై పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ఉన్నట్టుండి కేసీ వేణుగోపాల్ తెలంగాణకి రావడం, ఇక్కడి మంత్రులు, కీలక నాయకులతో మీటింగ్ పెట్టడంలో మతలబు ఏంటని ఆ మీటింగ్ కి ఆహ్వానం అందని నాయకులు గుసగుసలు పెడుతున్నారు. అయితే కేసీ వేణుగోపాల్ రాక వెనక పెద్ద సంగతే ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ పదికి పైగా స్థానాలు గెలవగలిగే అవకాశం తెలంగాణలో ఉంది. అయితే తాజా రిపోర్టులు పార్టీని కలవరపెట్టినట్టు తెలుస్తోంది. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగొలు ఇటీవల సర్వే నిర్వహించారు. కాంగ్రెస్ గెలుస్తాం అనుకుంటున్న సీట్లకు, గెలవగలిగే స్థానాలకు చాలా తేడా ఉన్నట్లు సునీల్ రిపోర్టులో బయటపడినట్లు సమాచారం

అధికారంలో ఉన్నామనే అతి నమ్మకం కాంగ్రెస్ కొంప ముంచేలా ఉందని సునీల్ టీమ్ కాంగ్రెస్ పార్టీకి తెలిపింది. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతలు తేరుకొని, కొన్ని పద్దతులు మార్చుకొని కమిట్మెంట్ తో పనిచేస్తే తాము అనుకున్న టార్గెట్ సులభంగా చేరుకోవచ్చని సునీల్ పార్టీ హై కమాండ్ కి చెప్పినట్లు సమాచారం. దానిలో భాగంగానే పార్టీ దూతగా కేసీ వేణుగోపాల్ తెలంగాణకి వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్ఠానం చెప్పిన విషయాలను తెలిపినట్టు సమాచారం.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కాస్త అజాగ్రత్త వహించినట్లు సునీల్ టీమ్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పేర్లు ప్రకటించిన అభ్యర్థులు తమ స్పీడ్ పెంచితే బాగుంటుందని, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మేల్యేలు సైతం పనితీరుని మెరుగు పరుచుకోవాలని సునీల్ చెప్పారట. ఇక అధికారంలో ఉన్నామనే కారణంతో చాలా మంది నేతలు రిలాక్స్ గా ఉన్నారని, ప్రచార కార్యక్రమాలను పూర్తిగా ఎంపీ అభ్యర్థులపై వేసి కొందరు ఎమ్మేల్యేలు అంటీముట్టనట్లు ఉంటున్నారని సునీల్ టీమ్ తెల్చినట్లు సమాచారం. మరోవైపు పాత కొత్త నేతల మధ్య సమన్వయం సైతం లోపించిందని దాన్ని వీలైనంత తొందరగా సెట్ చేసుకోవాలని సునీల్ రాష్ట్ర నేతలకు చెప్పినట్టు సమాచారం.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ 17 నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీలో గెలిచే నియోజకవర్గాలను చేర్చారు. కొంత కష్టపడితే గట్టెక్కే నియోజకవర్గాలను బీ కేటగిరీలో, చాలా కష్టపడాల్సిన సెగ్మెంట్ లను సీ కేటగిరీలో చేర్చి కేటగిరీ వారీగా పని విభజన, ప్రత్యేక టాస్క్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రజల్లోకి వెళ్ళే సమయంలో తమ ప్రభుత్వ ఆరు గ్యారెంటిల అమలును ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. వంద రోజుల పాలనతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సునీల్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది

సునీల్ ఇచ్చిన రిపోర్టులో పార్టీలో చేరిక అంశాన్ని కూడా ప్రధానంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ లోకి రావడానికి చాలామంది రెడీగా ఉన్నప్పటికీ కొత్తవాళ్ళు వస్తే తమ పరిస్థితి ఏమవుతుందోననే భయంతో చేరికలను అడ్డుకుంటున్నట్టు సునీల్ దృష్టికి చేరినట్లు సమాచారం. బూత్ లెవల్, మండల లెవల్ లో చేరికలు చాలా అవసరమని, పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయక అసెంబ్లీలో కొంత నష్టపోయామని పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలనే గ్రౌండ్ లెవల్ లో చేరికలు తప్పకుండా జరగాలని సునీల్ పార్టీకి చెప్పారట. దానిలో భాగంగానే చేరికలను ఎవరు అడ్డుకోవద్దు అని కేసీ వేణుగోపాల్ పదేపదే చెప్పినట్లు తెలుస్తోంది.

సునీల్ తన వ్యూహంతో కర్ణాటక, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశమున్న ప్రతి సెగ్మెంట్ గెలవడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. కొన్ని మార్పులు చేసుకుంటే ఆ నియోజకవర్గం గెలుస్తుంది అనుకుంటే అక్కడ ఎన్ని మార్పులు చేయడానికైనా, ఎంత కష్టపడడానికైనా సిద్దపడాలి అని కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్ర నేతలకు తేల్చి చెప్పింది. ఇక సునీల్ చెప్పిన సలహాలు ఎంత వరకు పాటిస్తారో చూడాలి.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్