20.7 C
Hyderabad
Friday, February 7, 2025
spot_img

పోలీసుల ముందే కూతుర్ని కాల్చి చంపేసిన తండ్రి. అసలు ఏమైంది..?

ఓ తండ్రి కూతురు పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. పెళ్లికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది. అయితే.. ఊహించని విధంగా కన్న తండ్రే ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని కాల్చి చంపాడు. అది కూడా పోలీసుల ముందే కూతుర్నే కాల్చేసాడు. నాలుగు రోజుల్లో పెళ్లితో ఎంతో ఆనందంగా ఉండాల్సిన ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

ఎక్కడ జరిగింది..? అసలు ఏమైంది..?
అది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్. గుర్జార్ అనే 20 ఏళ్ల అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేశారు కుటుంబ సభ్యులు. అయితే.. వేరే అబ్బాయిని ప్రేమించానని.. ఈ పెళ్లి చేసుకోనని.. తను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఈ అమ్మాయి తన మనసులో మాటలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చూసిన బాధితురాలి తండ్రి మహేష్ గుర్జార్ కోపం పెంచుకున్నాడు. తుపాకీని తీసుకుని ఆమెను చాలా దగ్గర నుంచి కాల్చి చంపాడు.

ఆమె పోస్ట్ చేసిన వీడియోలో తనకు ఇష్టం లేకపోయినా.. తన కుటుంబం ఒత్తిడి చేస్తుందని.. తనకు భయంగా ఉందని.. తనకు ఏదైనా జరిగితే.. కుటుంబ సభ్యులే కారణమని పోస్ట్ చేసిన 52 సెకన్ల వీడియోలో చెప్పింది. అంతే కాకుండా.. తను విక్కీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానుని.. మా కుటుంబం మొదట అంగీకరించింది కానీ.. తరువాత నిరాకరించింది. వారు నన్ను రోజూ కొట్టారు. అలాగే చంపేస్తామని బెదిరించారు అని తనూ వీడియోలో పేర్కొంది. ఆమె ప్రేమించిన వ్యక్తి విక్కీ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన వ్యక్తి. ఆరు సంవత్సరాలుగు తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పింది.

వీడియో వైరల్ అయిన తర్వాత, ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సూపరింటెండెంట్ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీసు అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. అయితే.. తనూ ఇంట్లో ఉండడానికి నిరాకరించింది. తనకి రక్షణ కల్పించాలని కోరింది. అయితే.. ఆమె తండ్రి ఆమెని ఒప్పించడం కోసం ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని పట్టుబట్టాడు. ఇంతలో పోలీసులు చూస్తుండగానే ఆమె ఛాతీ పై తుపాకీతో కాల్చాడు. ఆమె అక్కడిక్కడే చనిపోయింది.

ఆతర్వాత పోలీసులను కూడా బెదరించాడు. వెంటనే పోలీసులు మహేష్‌ ను అరెస్ట్ చేశారు. అయితే.. మహేష్ తో పాటు కాల్పులు జరిపిన బంధువు రాహుల్ తప్పించుకున్నాడు. జనవరి 18న పెళ్లి జరగాలి. పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ హత్య జరిగింది. మహేశ్ గుర్జార్‌ను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాహుల్ ఆచూకీ, పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Latest Articles

‘ఎటర్నల్‌’ గా జొమాటో రీ బ్రాండ్‌.. కొత్త లోగో

ఇండియన్‌ ఫుడ్‌ అండ్‌ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్‌.. జొమాటో తన పేరు మార్చుకుంది. కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. జొమాటో కాస్తా 'ఎటర్నల్‌' గా మారింది. కొత్త లోగోను కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్