పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన తోపులాట ఘటనకు సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్‌పై నమోదైన కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కి బదిలీ అయ్యింది. బీజేపీ ఎంపీల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీయే బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంగ్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్‌పై కేసు నమోదైంది. మరోవైపు బీజేపీపై కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఫిర్యాదుపైనా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు.