ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం దిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండటంతో ఈ నెల 20న జరగాల్సిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది.
చంద్రబాబు ఈరోజు సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రేపు సాయంత్రం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున చంద్రబాబు ప్రచారం కూడా చేశారు.