వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో మిర్చి రైతులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు.
జగన్ రాక నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు, రైతులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్.. వాళ్లకు మద్దతుగా నిలవనున్నారు. ఈ క్రమంలో మిర్చి యార్డును సైతం ఆయన సందర్శించే అవకాశం ఉంది. రైతులను అడిగి పలు విషయాలు తెలుసుకోనున్నారు.